చలికాలం మొదలవుతున్న తరుణంలో ఆరోగ్యం పరిరక్షణ కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో శరీరం వేడి నిలుపుకోవడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేస్తుందని, అలా చేయడానికి సరైన ఆహారం అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చల్లగాలులు పెరిగే కొద్దీ తగిన ఆహారం తీసుకోకుంటే రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో జలుబు, దగ్గు, ఫ్లూ, శ్వాసకోశ సమస్యలు, జాయింట్ నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరికలు వెలువడుతున్నాయి.

ఇలాంటి సమయంలో ఏ ఆహారాలు తప్పనిసరిగా తినాలి? ఏవి దూరం పెట్టాలి? ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా “చలికాలంలో తినవలసిన & తినకూడని ఆహారాలు”పై పూర్తి వివరాలు మీకోసం…

◾1. అల్లం (Ginger) :

చలిని తగ్గించే సహజ ఔషధంగా అల్లం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అల్లం టీ, అల్లం నీరు, ఆహారంలో అల్లం కలపడం వలన శరీరంలో హీట్ పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, దగ్గు, జలుబు సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో కనీసం రోజుకు ఒక్కసారైనా అల్లం నీరు లేదా అల్లం టీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

◾2. వెల్లుల్లి (Garlic) :

వెల్లుల్లిలో ఉన్న ‘అలిసిన్’ అనే పదార్థం శరీరానికి శక్తి, వేడి, రోగనిరోధక శక్తిని ఇస్తుంది.
ప్రతిరోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చలి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. హృదయ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

◾3. పొడి పండ్లు (Dry Fruits) :

చలికాలంలో తినడానికి అత్యుత్తమమైనవి బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్. ఇవి శరీరాన్ని వేడిగా ఉంచి ఎనర్జీని పెంచుతాయి. కేవలం 4–5 బాదం, 2–3 వాల్‌నట్స్, 4 కిస్మిస్‌తో రోజును ప్రారంభిస్తే చలి ప్రభావం తగ్గుతుంది.

◾4. నువ్వులు – నువ్వుల లడ్డూలు :

చలికాలంలో నువ్వులు శరీర హీట్‌ను సహజంగా పెంచుతాయి. నువ్వుల లడ్డూలు, చిక్కీల రూపంలో తీసుకుంటే ఎముకలు బలపడతాయి, శరీరం వేడిగా ఉంటుంది.

◾5. గోధుమ – రాగి – జొన్నల ఆహారం :

వింటర్‌లో మిల్లెట్స్ చాలా ప్రయోజనకరం. రాగి సంగతి, రాగి మాల్ట్, జొన్న రోటీ, గోధుమ చపాతీలు తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు ఎనర్జీ కలుగుతుంది. బాడీలో హీట్ మింటైన్ అవుతుంది, డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది.

◾6. గుడ్లు (Eggs) :

చలికాలంలో రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తింటే ప్రోటీన్ పెరుగుతుంది. శరీరంలో వేడి ఉంటుంది. బలం, స్టామినా పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఉడికించిన గుడ్లు తీసుకోవడం ఉత్తమం.

◾7. సూపులు :

వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్, మటన్ సూప్… ఇవన్నీ చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గొంతు నొప్పి తగ్గుతుంది, శరీర వేడి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

◾8. కందమూలాలు (Sweet Potatoes, చిలగడదుంప) :

చిలగడదుంపలో విటమిన్-A, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వింటర్‌లో ఇవి శరీరానికి వేడి అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

◾9. ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్ :

చలికాలం రూట్ వెజిటబుల్స్‌కు సీజన్. ఇవి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అందిస్తాయి. ఇమ్యూనిటీ పెంపుకు ఇవి చాలా ముఖ్యమైనవి.

◾10. తేనె (Honey) :

చలికాలంలో చక్కెర కన్నా తేనె వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తేనె గొంతుకు హీట్ ఇస్తుంది, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి దగ్గు, జలుబు తగ్గిస్తుంది.

◾11. కాషాయాలు / హర్బల్ టీ :

అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, తులసితో తయారు చేసిన కాషాయాలు చలిని తగ్గిస్తాయి. రోజూ కనీసం ఒకసారి తీసుకుంటే చల్లగాలుల ప్రభావం తగ్గుతుంది.

వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం చలికాలంలో దూరంగా పెట్టాల్సిన కొన్ని ఆహారాలు ఇవి:

◾1. ఐస్ క్రీమ్స్, చల్లటి పానీయాలు :

చల్లటి వస్తువులు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, దగ్గు, గొంతు నొప్పి, జలుబు సమస్యలను పెంచుతాయి.

◾2. ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు :

కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్లు, జ్యూసులు… ఇవి తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఫ్లూ, ఇన్ఫెక్షన్లకు అవకాశం పెరుగుతుంది. బరువు పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది.

◾3. వేయించిన పదార్థాలు (Fried Foods) :

పకోడీలు, బజ్జీలు, సమోసాలు వంటి పదార్థాలు చలికాలంలో చాలామంది ఇష్టపడుతారు.
కానీ ఇవి గ్యాస్, జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్ పెంపు, బరువు పెరుగుదల
కు కారణమవుతాయి.

◾4. అధిక క్యాఫిన్ పానీయాలు :

రోజుకు ఎక్కువగా టీ, కాఫీ తాగితే శరీరంలో నీరు తగ్గి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
చలికాలంలో ఇది ప్రమాదకరం ఎందుకంటే మనం నీరు తాగగలికినంతగా తాగం.

◾5. రాత్రివేళ చల్లటి పాలు :

రాత్రి చల్లటి పాలు తాగడం వల్ల గొంతు బ్లాక్ అవుతుంది, దగ్గు పెరుగుతుంది, తినాలంటే గోరు వెచ్చని పాలు మాత్రమే తాగాలి.

◾6. ఎక్కువగా బియ్యం తినడం :

చలికాలంలో రాత్రివేళ ఎక్కువ బియ్యం తింటే బాడీ చల్లబడుతుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని బదులుగా రాగి, జొన్న, గోధుమ వంటకాలు మంచివి.

◾7. పాత లేదా రాత్రంతా ఉంచిన ఆహారం :

చలికాలంలో బ్యాక్టీరియా నెమ్మదిగా పెరిగినా ఆహారం పాడుకాకపోయినట్లే కనిపిస్తుంది. అయితే రాత్రంతా ఉంచిన ఆహారం తింటే ఫుడ్ పొయిజనింగ్, జీర్ణ సమస్యలు
వచ్చే ప్రమాదం ఉంది.

▪️1. తగినంత నీరు తాగాలి :

చలి సమయంలో దాహం అనిపించదు. కానీ నీరు తాగకపోతే చర్మం పొడిబారుతుంది. శరీరం నీరసం అవుతుంది, రోజుకు కనీసం 2–2.5 లీటర్లు నీరు తాగాలి.

▪️2. వ్యాయామం :

వింటర్‌లో వ్యాయామం ఆపేస్తే మెటబాలిజం తగ్గిపోతుంది. నిపుణులు రోజుకు 30 నిమిషాల brisk walk తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు.

▪️3. సూర్యరశ్మి తీసుకోవాలి

విటమిన్-D లోపం ఎక్కువగా చలికాలంలోనే కనిపిస్తుంది. రోజూ ఉదయం 8–9 గంటల మధ్య 15 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం మంచిది.

▪️4. శరీరాన్ని వేడిగా ఉంచే దుస్తులు :

క్యాపులు, షాల్స్, సాక్స్, గ్లోవ్స్ వాడడం ద్వారా చలిని అదుపులో ఉంచవచ్చు. చలికాలంలో సరైన ఆహారం తీసుకుంటే శరీర వేడి కాపాడటం మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తి పెంపుతో seasonal health issues‌ను తగ్గించుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి, నువ్వులు, సూపులు, డ్రై ఫ్రూట్స్ వంటివి తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి.

అదే సమయంలో చల్లటి పానీయాలు, చక్కెర పదార్థాలు, ఫ్రై ఐటమ్స్‌ను తగ్గిస్తే చలికాలాన్ని ఆరోగ్యంగా గడపవచ్చు.


error: .