భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ (మధుమేహం) ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, డయాబెటిస్ రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితి కేవలం ఔషధాలతో మాత్రమే నియంత్రించబడదు; ఆహార నియమాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. తప్పు ఆహారం తీసుకుంటే చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు కలగవచ్చు. సరైన ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్‌ను సాధారణ స్థాయిలో ఉంచడం పూర్తిగా సాధ్యమే.

ఈ పూర్తిస్థాయి గైడ్‌లో డయాబెటిస్ ఉన్నవారు ఏ ఆహారాలు తినకూడదు?, ఏవి తినవచ్చు?, భోజనం ఎలా ఉండాలి?, రోజుకు ఎంత తినాలి?, ఏ తప్పులు చేయకూడదు? వీటి గురించి వివరంగా తెలుసుకుందాం…

డయాబెటిస్ అంటే ఏమిటి?

రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రించే ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం ఆ ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. దీన్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు:

  1. Type 1 Diabetes – ఇన్సులిన్ పూర్తిగా తగ్గిపోవడం.
  2. Type 2 Diabetes – ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం.

ఇప్పట్లో ఎక్కువ మంది Type 2 Diabetes వల్లే బాధపడుతున్నారు, ఇది ఆహారం, బరువు, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు తప్పక పాటించాల్సిన ముఖ్య ఆహార నియమాలు…

◾ రోజూ తిన్న ఆహారం రక్తంలో చక్కెరపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే, ఆహారాన్ని రెండు విభాగాలుగా తెలుసుకోవాలి:

  1. తినకూడని (High GI / High Sugar / High Carb Foods)
  2. తినవచ్చని (Low GI / High Fiber / High Protein Foods)

ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా వివరిద్దాం…

డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలు (Foods to Avoid)

కింది ఆహారాలు రక్త చక్కెరను వేగంగా పెంచుతాయి. వీటిని పూర్తిగా మానేయడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.

  1. తెల్ల బియ్యం (White Rice)

తెల్ల బియ్యం High Glycemic Index కలిగి ఉంటుంది. తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. కాబట్టి దానికి బదులు బ్రౌన్ రైస్ / మిల్లెట్ / క్వినోవా తీసుకోవడం మంచిది.

  1. చక్కెర ఉన్న ఆహారాలు

రక్త చక్కెరను వేగంగా పెంచే ఆహార పదార్థాలు…

మిఠాయీలు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్, కేకులు, డోనట్స్, జామ్ / జెల్లీ. ఇవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

  1. చక్కెర కలిపిన పానీయాలు

Cool drinks, Packaged fruit juices, Energy drinks, Sweet tea / flavoured milk. ఇవి ఫైబర్ లేని ప్యూర్ శర్బత్ లాంటివి, రక్తంలో చక్కెరను వెంటనే పెంచేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.

  1. తెల్ల పిండి (Maida)తో చేసిన ఆహారాలు

పూరీలు, పాస్తాలు, బిస్కెట్లు, బ్రెడ్, నూడుల్స్ ఇవి శరీరంలో గ్లూకోజ్‌గా వేగంగా పెంచుతాయి. కావున డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.

  1. వేయించిన పదార్థాలు

పకోడి, బజ్జీ, సమోసా, చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, అధిక నూనె + కార్బోహైడ్రేట్ = రక్త చక్కెర పెరుగుదల. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.

  1. పండ్ల రసాలు (Fruit Juices)

పండ్లలో ఫైబర్ ఉన్నా, రసాలు చేసేప్పుడు ఫైబర్ పోతుంది.
మిగిలేది ప్యూర్ షుగర్ మాత్రమే. జ్యూస్ కంటే పండ్లను మొత్తంగా తినడం మంచిది.

  1. బంగాళాదుంప (Potato)

స్టార్చ్ అధికంగా ఉండటం వల్ల రక్త చక్కెరను వెంటనే పెంచుతుంది. దీనికి బదులు స్వీట్ పొటాటో (తక్కువ GI) తీసుకోవడం మంచిది.

  1. బీరకాయ, దోసకాయలాంటి (watery vegetables )

ఇవి హానికరం కావు కానీ చాలా ఎక్కువ తింటే బ్లడ్ షుగర్ తగ్గి మళ్లీ ఆకలి వేయడం వల్ల మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది.

  1. ఫాస్ట్ ఫుడ్

బర్గర్లు, పిజ్జాలు, శాండ్‌విచ్లు, ఫ్రైడ్ చికెన్, నూడిల్స్, అధిక కార్బోహైడ్రేట్స్ + నూనె + చక్కెర ఉన్న సాస్‌లతో ప్రమాదకరం. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.

  1. మద్యం (Alcohol)

మద్యం లివర్ పనిని దెబ్బతీస్తుంది. ఇన్సులిన్ చర్య తగ్గి రక్త చక్కెర పెరుగుతుంది. కాబట్టి మద్యం మానివేయాలి.

డయాబెటిస్ ఉన్నవారు తినవలసిన ఆహార పదార్థాలు (Foods You Can Eat)

ఇవి రక్త చక్కెరను నెమ్మదిగా పెంచుతాయి మరియు శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

  1. సంపూర్ణ ధాన్యాలు (Whole Grains)

బ్రౌన్ రైస్, రాగి, జొన్న, సజ్జ, బార్లీ, ఓట్స్, ఇవి Low GI కలిగి ఉండి చక్కెర నియంత్రణకు బాగా సహాయపడతాయి.

  1. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు

శనగలు, పెసర్లు, బీన్స్, గుడ్లు, ఫిష్, చికెన్ (boiled or grilled), పెరుగు, ప్రోటీన్ చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

  1. ఆకుకూరలు

పాలకూర, బచ్చలి, తోటకూర, మెంతికూర, సొరకాయ, దొండకాయ, ఫైబర్ అధికంగా ఉండి చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

  1. ఫైబర్ ఉన్న కూరగాయలు

బీట్‌రూట్, క్యారెట్, బ్రోకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ రోజూ తినవచ్చు. GI చాలా తక్కువగా ఉంటుంది.

  1. డ్రైఫ్రూట్స్ (పరిమితంగా తీసుకోవాలి)

బాదం (Almonds), వాల్‌నట్స్, పిస్తా, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ రోజుకు చిన్న ముట్టెంత తీసుకోవచ్చు.

  1. పండ్లు (పరిమితంగా తీసుకోవాలి)

డయాబెటిస్ ఉన్నవారికి హాని చేయని పండ్లు ఆపిల్, ఆరెంజ్, పపయ, జామ, బెర్రీలు, పియర్స్.

  1. గ్రీన్ టీ, హెర్బల్ టీ

చక్కెర లేకుండా తీసుకుంటే చాలా మంచిది.

  1. మెంతుల పొడి & మెంతుల నీరు

శాస్త్రీయంగా రక్త చక్కెర నియంత్రణకు సహాయపడుతుందని నిరూపణ అయింది.

  1. కొబ్బరి నీరు

చక్కెర తక్కువ, పొటాషియం అధికం. రోజుకు ఒకసారి తాగొచ్చు.

  1. పెరుగు (Curd / Yogurt)

ప్రోబయోటిక్స్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారి ఆహార పద్ధతులు ఇలా ఉండాలి (Ideal Plate Method) తినేది మూడు భాగాలుగా విభజించుకుంటే…

🍀 50% – కూరగాయలు : వేపుడు కాదు, ఉడికించిన లేదా lightly sautéed.

🍗 25% – ప్రోటీన్ : గుడ్డు / ఫిష్ / చికెన్ / పప్పులు.

🍚 25% – Whole Grains : జొన్న / రాగి / బ్రౌన్ రైస్.

అదనంగా… 1 బౌల్ పెరుగు, ఒక ముక్క పండు, ఈ ఈ పద్ధతి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు అత్యుత్తమం.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం రొటీన్ గా చేయవలసినవి…

నిద్ర లేచిన వెంటనే వెచ్చని నీరు తాగడం, 1గంట తరువాత మెంతుల నీరు లేదా చియా సీడ్స్ నీరు తాగడం, 30 నిమిషాలు నడవడం, ఎక్కువ ప్రోటీన్ లు ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం, రోజంతా డయాబెటిస్ డైట్ తీసుకోవాలి.

Sample Menu Breakfast

ఓట్స్ + నట్స్
లేదా, 2 గుడ్లు + కూరగాయలు
లేదా, రాగి దోసె + పెరుగు తీసుకోవాలి.

Lunch Menu

మధ్యాహ్న భోజనంలో తక్కువగా బ్రౌన్ రైస్ తీసుకోవడం, దాల్ / చికెన్ సూప్, సలాడ్ తీసుకోవడం చాలా మంచిది.

Snacks Menu

స్నాక్స్ లో పల్లీలు / బాదం, గ్రీన్ టీ తీసుకోవాలి.

Dinner Menu

రాత్రి భోజనంలో రోటీలు (రాగి / జొన్న), కూరగాయ కూరలు, పెరుగు తీసుకోవడం మంచిది.

డయాబెటిస్ ఉన్నవారు చేయకూడని పెద్ద తప్పులు

❌ భోజనం మిస్ అవడం
❌ ఒకేసారి ఎక్కువ తినడం
❌ నిద్రకు ముందు బియ్యం తినడం
❌ ఫాస్ట్ ఫూడ్ అలవాటు
❌ ఎక్కువ పండ్లు తినడం
❌ జ్యూస్ తాగడం
❌ స్ట్రెస్ ఎక్కువగా ఉంచుకోవడం

వ్యాయామం ఎందుకు తప్పనిసరి?

రోజుకు 30–40 నిమిషాలు వేగంగా నడక చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది, బరువు నియంత్రిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. శాస్త్రీయంగా అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.

డయాబెటిస్ ఉన్నవారు ఏ మందులు తీసుకున్నా, ఆహారం సరైన విధంగా లేకుంటే చక్కెర నియంత్రణ అసాధ్యం. అందుకే ఏ ఆహారాలు రక్త చక్కెరను పెంచుతాయి, ఏవి తగ్గిస్తాయి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందులో చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. హార్ట్ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ముఖ్యంగా జ్యూస్, మిఠాయిలు, తెల్ల బియ్యం, మైదా పదార్థాలను తగ్గించి, ఫైబర్, ప్రోటీన్, Whole Grains ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్‌ను సహజంగా నియంత్రించవచ్చు.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం + సరైన జీవనశైలి = నియంత్రిత డయాబెటిస్.


error: .